03-01-2026 08:26:33 PM
యాదిగిరిగుట్ట,(విజయక్రాంతి): ఖమ్మంలో ఈనెల 18న జరుగు సిపిఐ శతజయంతి ఉత్సవాల బహిరంగ సభను జయప్రదం చేయండి సిపిఐ జిల్లా కార్యదర్శి యనాల దామోదర్ రెడ్డి, భారత కమ్యూనిస్టు పార్టీ యాదగిరిగుట్ట మండల కౌన్సిల్ సమావేశం శనివారం మర్రిగూడెం గ్రామంలో సీపీఐ మండల కార్యవర్గ సభ్యులు గుండు వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా పార్టీ కార్యదర్శి యానాలు దామోదర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ... భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఖమ్మం పట్టణంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం.
ఈ బహిరంగ సభను జయప్రదం చేయడానికి ప్రతి కార్యకర్త కంకణ బద్దులు కావాలని కోరారు భారత కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్రానికి పూర్వం పుట్టి దేశ స్వాతంత్రములో పాల్గొని తెలంగాణలో నిజాo రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి 4,500 మంది కమ్యూనిస్టులను బలిదానం ఇచ్చి పది లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదని ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి ప్రజల కోసం చరిత్రను వక్రీకరిస్తూ మతం పేరుతో రాజకీయాలు చేస్తూ పేద ప్రజల సమస్యలు పక్కకి పెట్టి బడా పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అప్పచెబుతున్నారని, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టo పేరు జిరాంజీగా మార్చడం పేద ప్రజలను ఉపాధి హామీ చట్టానికి దూరం చేయడానికి అని విమర్శించారు.
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోదా శ్రీరాములు మాట్లాడుతూ ఖమ్మంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయుట కొరకు విస్తృతమైన ప్రచారం నిర్వహించాలని గోడ రాతలు, ఓర్డింగులు, ముగ్గుల పోటీ నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, పేరభొయిన మహేందర్,చెక్క వెంకటేష్ మండల కార్యదర్శి కలేపల్లి మహేందర్ పట్టణ కార్యదర్శి బబ్బురి శ్రీధర్,పేర బొయిన పెంటయ్య,గోరేటి రాములు,పేరబోయిన బంగారి,ఆరె పుష్ప,రైతు సంఘం నాయకులు ధర్మారెడ్డి గూడెం సర్పంచ్ కొల్లూరు రాజయ్య మర్రిగూడెం సర్పంచ్ బోదాసు స్వప్న జగన్ చిన్న కందుకూరు ఉపసర్పంచ్ కాటం శ్రీకాంత్ , బోదాసు స్వామి,మీసాల దాసు, మద్దూర్ భాగ్యమ్మ,లక్ష్మి, కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.