calender_icon.png 18 December, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట

18-12-2025 12:16:43 AM

  1. అనుమతి లేకుండా అక్రమ రవాణాకు పాల్పడితే 

చర్యలు తప్పవు:  తహసీల్దార్ శ్రీకాంత్ 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి)డిసెంబర్17: అనుమతి లేకుండా ఇసుకను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్ హెచ్చరించారు. బుధవారం మూసి పరివాహక ప్రాంతమైన జాజిరెడ్డిగూడెం గ్రామంలోని గంగదేవమ్మ ఆలయ ప్రాంగణంలో గల బతుకమ్మ కుంట వద్ద ఇసుక అక్రమ రవాణాను నివారించడానికి రెవెన్యూ సిబ్బంది తగు చర్యలు తీసుకుంది.

ఈ సందర్భంగా బతుకమ్మ కుంట వద్ద జెసీబీలతో కందకం తవ్వి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేశారు. అనంతరం తహసీల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే ట్రాక్టర్లను సీజ్ చేసి ఓనర్, డ్రైవర్లపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అన్నారు. కార్యక్రమంలో గిర్థవార్ జలంధర్ రావు ,పంచాయతీ కార్యదర్శి,రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.