18-12-2025 12:15:48 AM
కరింనగర్, డిసెంబర్17(విజయక్రాంతి): మూడు విడతలుగా గ్రామ పంచాయతీ లకు నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఓటింగ్ శాతం పెంచడంతో పాటు, మెడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, దివ్యంగులు, వయో వృద్ధులను తరలింపు ఏర్పాట్లు చేయటం, ఓటింగ్ శాతం పెంచేందుకు గులాబీ పువ్వులతో ఆహ్వానించడం లాంటి కార్యక్రమాలతో నాలుగు జిల్లాల పాలనదికారులు శభాష్ అనిపించుకున్నారు. ఆయా జిల్లాల పోలీస్ యంత్రాంగం సమర్థవంత మైన సేవలు అందించారు.
కరీంనగర్ జిల్లాలో 86.42శాతం..
మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తంగా 86.42% ఓట్లు పోలయ్యాయి. మండలాల వారీగా పరిశీలిస్తే ఇల్లందకుంట లో 87.05%, హుజరాబాద్ లో 85.04, జమ్మికుంట లో 85.72 వీణవంక 85.87 సైదాపూర్ 87.85 శాతంగా నమోదయింది.
జగిత్యాల జిల్లాలో 79.64 శాతం
జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడవ విడత ఎన్నికల పోలింగ్ 79.64 శాతం నమోదు అయింది. బుగ్గారం, ధర్మపురి, ఎండపెల్లి, గొల్లపెల్లి, పెగడపెల్లి, వెల్గటూర్ మండలాల్లో బుధవారం పోలింగ్ నిర్వహించారు. 6 మండలాల్లో కలిపి మొత్తం ఓట్లు 1,71,920 ఉండగా పోల్ 1,36,917 అయ్యాయి. 79.64 శాతం పోలింగ్ నమోదు అయింది. బుగ్గారం మండలంలో మొత్తం ఓటర్లు 17,347మంది ఉండగా, 13,496 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 77.8 శాతం నమోదు అయింది.ధర్మపురి మండలంలో మొత్తం ఓటర్లు 34,638మంది ఉండగా, 25,302 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 73.05 శాతం నమోదు అయింది.
ఎండపెల్లి మండలంలో మొత్తం ఓటర్లు 22,825 మంది ఉండగా, 19,110 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 83.72 శాతం నమోదు అయింది.
గొల్లపెల్లి మండలంలో మొత్తం ఓటర్లు 39,658 మంది ఉండగా, 32,065 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 80.85 శాతం నమోదు అయింది.
పెగడపెల్లి మండలంలో మొత్తం ఓటర్లు 34,768 మంది ఉండగా27,855 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 80.12 శాతం నమోదు అయింది.
వెల్గటూర్ మండలంలో మొత్తం ఓటర్లు 22,684 మంది ఉండగా, 19,089 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 84.15 శాతం నమోదు అయింది......
పెద్దపల్లి జిల్లాలో 85.66 శాతం
జిల్లాలో మూడవ విడత 85 గ్రామ పంచాయతీలకు, 636 వార్డులకు నిర్వహించిన పోలింగ్ లో 85.66 శాతం మంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఉదయం 9 గంటల వరకు 22.50%, 11 గంటలకు 57.21%, 1 గంట వరకు 82.34% పోలింగ్ నమోదైంది, ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు టోకెన్ అందించి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామని, వారితో కలిపి మొత్తం పెద్దపల్లి జిల్లాలో మూడవ విడత 85.66% పోలింగ్ నమోదైందని అన్నారు. మూడవ విడత పోలింగ్ నిర్వహించిన పెద్దపల్లి మండలంలో 86.39%, సుల్తానాబాద్ మండలంలో 86.51 శాతం, ఎలిగేడు మండలంలో 83.73%, ఓదెల మండలంలో 84.70% పోలింగ్ నమోదైందని, మొత్తం లక్షా 42 వేల 548 మంది ఓటర్లకు గాను లక్షా 22 వేల 111 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 79.14 శాతం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లో బుధవారం పోలింగ్ నిర్వహించారు. నాలుగు మండలాల్లో కలిపి మొత్తం 1,25,324ఓట్లు ఉండగా, 99,183పోల్ అయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 79.14 శాతం పోలింగ్ నమోదు అయింది.
మండలాల వారీగా..
వీర్నపల్లి మండలంలో మొత్తం ఓటర్లు 11,066 మంది ఉండగా, 9,065మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 81.92 శాతం నమోదు అయింది. ముస్తాబాద్ మండలంలో మొత్తం ఓటర్లు 37,711 మంది ఉండగా, 30,434 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 80.70 శాతం నమోదు అయింది. గంభీరావుపేట మండలంలో మొత్తం ఓటర్లు 36,135 మంది ఉండగా, 28,816మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 79.75 శాతం నమోదు అయింది. ఎల్లారెడ్డిపేట మండలంలో మొత్తం ఓటర్లు 40,412 మంది ఉండగా, 30,868 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 76.38 శాతం నమోదు అయింది.
వాయిదా...
కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకారాన్ని ఈ నెల 20 నుండి 22కు వాయిదా వేశారు. 20న అమావాస్య కావున 22కు వాయిదా వేయాలని ప్రజాప్రతినిధులు కోరిన మీదట పంచాయతీ రాజ్ శాఖ ముహూర్తాన్ని 22కు వాయిదా వేసింది.