29-09-2025 12:53:09 AM
కామారెడ్డి, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా యోగ భవన్లో గంజి ఆంజనేయులు సహకారంతో ఆదివారం నాలుగు వేదాల కు సంబం ధించిన తెలుగు అనువాద గ్రంథాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా యోగ అధ్యక్షుడు యోగా రామ్ రెడ్డి తెలిపారు. వివిధ దాతల సహకారంతో 25వేల విలువ గల నాలుగు వేద గ్రంధాల ను యోగ భవన్లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతిరోజు వేదంలోని ఐదు మంత్రాలను అర్థ సైత పఠణం చేయనున్నట్లు తెలిపారు.