calender_icon.png 29 September, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేసిన రాజ్యసభ సభ్యుడు

29-09-2025 12:53:39 AM

అలంపూర్ ,సెప్టెంబర్ 28:అష్టదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ దేవి అమ్మవారి దేవీ నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జోగులాంబ అమ్మవారికి బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు ఆదివారం రాజ్యసభ సభ్యుడు, అనిల్ కుమా ర్ యాదవ్ కుటుంబ సమేతంగా అమ్మవారికి స్వామివారికి పట్టువస్తాలన అందజేశారు.

అంతకంటే ముందుగా వీరికి ఆలయ ఈ ఓ దీప్తి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ముందుగా స్వామివారికి అభిషేకాలు, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఆలయాల విశిష్టతల గురించి ఆలయ అర్చకులు వారికి వివరించారు. వీరి వెంట ఆలయ పాలకమండలి సభ్యులు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.