20-10-2025 12:00:00 AM
వనపర్తి, అక్టోబర్ 19 ( విజయక్రాంతి ) : వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేం ద్రంలో దీపావళి పాము కాటు జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన వీపీఎల్ సీజన్-5, ఏపీఎల్ సీజన్-2 క్రికెట్ టోర్నమెంట్ ను ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీరయ్య, సిపిఎం మండల కార్యదర్శి బాల్ రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రైతుబందు సమితి మండల మాజీ అధ్యక్షులు ముంత మల్లయ్య యాదవ్ పలువురు నాయకులు ప్రారంభించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ యువత శారీర కంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు క్రీడలు ఎంతో అవసరమని గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం వల్ల జీవితంలో విజయాలు సులభతరం అవుతాయి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు రవీందర్ రెడ్డి, ఆదయ్య, అడ్వకేట్ కిష్టయ్య, నారాయణ, గోపి, పాము నాగులు, రాఘవేందర్ రెడ్డి, మీసాల నాగరాజు, రాజశేఖర్ ఉన్నారు.