calender_icon.png 20 October, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజానికి మీ అనుభవం అవసరం

20-10-2025 12:00:00 AM

సీనియర్ సిటిజన్స్ ఫోరం నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

మహబూబ్ నగర్, అక్టోబర్ 19(విజయక్రాంతి): సమాజానికి మీ అనుభవం ఎంతో అవసరమని మహబూబ్ నగర్ ఎ మ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సీనియర్ అన్నారు. ఆదివారం 10 లక్షలను జనరల్ ఫండ్ ఉపయోగించి నగరంలోని ఇండస్ట్రీయల్ ఏరియా లోని సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యా లయం ఆవరణలో నూతనంగా నిర్మించిన సీనియర్ సిటిజన్స్ ఫోరం నూతన భవనాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు.

సీనియర్ సిటిజన్స్ సంక్షేమం కో సం తాను పనిచేస్తానని, ఆయన స్పష్టం చేశారు. జిల్లా సీనియర్ సిటిజన్స్ ఫోరంలో 10 వేల మంది మెంబర్ షిప్ లను టార్గెట్ గా చేసుకుని పూర్తి చేస్తే కోటి రూపాయలు ఫండ్ ఫోరం కు అందజేస్తానని హామి ఇచ్చారు. మీ చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్ళితే 20,25శాతం రాయితీ ఇచ్చే విధంగా ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలతో మాట్లాడి ఒప్పిస్తానని చెప్పారు. సీనియర్ సిటిజన్స్ కోసం ఒక అధునాతన గ్రంథాలయాన్ని త్వరలో ఏర్పాటు చేస్తానని అన్నారు.

రాజకీయా లకు అతీతంగా సమాజానికి ఉపయోగపడే వారిని, నీతిమంతులనే ఈ ఫోరంలో సభ్యులుగా చేర్చుకోవాలని ఆయన సూచించారు.  మహబూబ్ నగర్ అభివృద్ధికి , మహబూబ్ నగర్ ను మొదటి స్థానంలో నిలిపేందుకు మీ అందరి తోడ్పా టు ఎల్లప్పుడూ అందించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదు ల్లా కొత్వాల్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చై ర్మన్ షబ్బీర్ అహ్మద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి నోద్ కుమార్,, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు జగపతి రావు, ఉపాధ్యక్షులు రాజు సింహుడు, కార్యదర్శి ఎన్.నాగభూషణం సభ్యులు బా లయ్య, సూర్య నారాయణ, గంగాధర్, జి.నాగభూషణం, బా లకృష్ణ , రాములు, సరోజమ్మ కాంగ్రెస్ పార్టీ నాయకులు తి రుమల వెంకటేష్, గంజి వెంకట్రాములు, ప్రశాంత్, వర్థ రవి ఎఇ రాఘవినతి, వర్క్ ఇన్స్పెక్టర్ నరహరి పాల్గొన్నారు.