calender_icon.png 20 November, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిసెంబర్‌లో క్రికెట్ టోర్నమెంట్

20-11-2025 12:00:00 AM

  1. టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో నిర్వహణ
  2. విజేతలకు అందజేసే కప్పుల ఆవిష్కరణ
  3. ఘనంగా క్రీడా వార్షిక సంబురాలు

హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీఓస్) సెంట్రల్ యూనియన్ 12వ వార్షిక క్రీడా పోటీల్లో భాగంగా హైదరాబాద్ జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ ఆధ్వర్యంలో డిసెంబర్‌లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. విజేతలకు అందించే రామిని మెమోరియల్ క్రికెట్ విన్నర్స్ కప్‌ను, రన్నర్స్‌కు అందించే ఆర్ రంజన మెమోరియల్ క్రికెట్ కప్‌ను సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మారమ్ జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం. హుస్సేని (ముజీబ్) ఆవిష్కరించారు.

గత 12 సంవత్సరాలుగా తెలంగాణ ఎన్జీఓస్ యూనియన్, హైదరాబాద్ జిల్లా కార్యవర్గం వార్షిక క్రీడా సంబరాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది. హైదరాబాద్లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రతి సంవత్సరం ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మారమ్ జగదీశ్వర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల మధ్య సోదరభావాన్ని, పరస్పర సహకారాన్ని పెంపొందించడంలో క్రీడలు ముఖ్యపాత్ర పోషిస్తాయని అన్నారు.

డాక్టర్ ఎస్.ఎం. హుస్సేని మాట్లాడుతూ, క్రీడలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న హైదరాబాద్ జిల్లా యూనియన్ కార్యవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ ఎన్జీఓస్ యూనియన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కుమార్, సెంట్రల్ యూనియన్ ప్రతినిధులు కొండల్ రెడ్డి, నరసింహరెడ్డి, నజీర్ అహ్మద్, పర్వతాలు, సంతోష్, నాలుగో తరగతి ఉద్యోగుల సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు దాస్య నాయక్, ప్రధాన కార్యదర్శి ఖాదర్ బిన్ హసన్, టీఎన్జీఓస్ యూనియన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, టీఎన్జీఓస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ కె. ఆర్. రాజ్కుమార్, కోశాధికారి జె. బాల్రాజ్, జిల్లా ప్రతినిధులు ఇ. నరేష్, ఖాలేద్ అహ్మద్, శంకర్, ముఖీం ఖురేషి, శ్రీధర్ పాల్గొన్నారు.