20-11-2025 12:06:46 AM
హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): తెలంగాణ విద్యా విధానాన్ని (టీఈపీ) రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులు 2027-28 నుంచి అమలయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ సలహాదారు కే.కేశవర రావు చైర్మన్‌గా, మరో ఆరుగురు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కమిటీ తన నివేదికను అక్టోబర్ 30వరకు తెలంగాణ రైజింగ్ 2047ను దృష్టిలో ఉంచుకొనిఎన్‌ఈపీ-2020 లోని అం శాలను అధ్యయనం చేసి రాష్ట్రానికి అనుగుణంగా మార్పులు చేయాల్సి ఉంటుం ది. అయితే పాఠశాల స్థాయి పాఠ్యాంశాల్లో సిలబస్ మార్పులు చేయాలంటే ఇప్పట్లో సాధ్యపడదు. ఇంకా కమిటీ గడువే ముగియలేదు.
ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత అందులోని అంశాలపై నిర్ణయం తీసుకొని అప్పుడు పాఠ్యాంశాల్లో పొందుపర్చాల్సి ఉం టుంది. 2026-27 విద్యాసంవత్సరానికి పాఠ్యపుస్తకాల ముద్రణ, సిలబస్ రివిజన్, టెండర్ ప్రక్రియకు సంబంధించిన చర్యలను ఇప్పటికే విద్యాశాఖ చేపట్టడంతో టీఈపీపై కమిటీ ఇచ్చే సిఫార్సులు వచ్చే ఏడాది అమలు కష్టమే.