calender_icon.png 20 November, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

22న ఆర్‌బీవీఆర్‌ఆర్ గ్రాడ్యుయేషన్ డే

20-11-2025 12:00:00 AM

హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): ఆర్‌బీవీఆర్‌ఆర్ మహిళా కళాశాల 14వ గ్రాడ్యుయేషన్ డే ను ఈ నెల 22న ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 2020-2023, 2021-2024 గ్రాడ్యుయేషన్ తరగతుల నుంచి 562 మం ది విద్యార్థుల విద్యా విజయాలను సత్కరిస్తుంది. ముఖ్య అతిథిగా హరిచందన దాసరి, కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ పాల్గొంటారు. ఓయూలో పరీక్షల కంట్రోలర్ ప్రొఫెసర్ కె. శశికాంత్ గౌరవ అతిథిగా వ్యవహరిస్తారు.

ఈ కార్యక్రమాన్ని కళాశాల సెక్రటరీ, -కరస్పాండెంట్ ప్రొఫెసర్ జి. సుదర్శన్‌రెడ్డి పర్యవేక్షిస్తారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జె. అచ్యుత దేవి, పరీక్షల కంట్రోలర్ టి. వాణి మాధవి సహకారంతో నిర్వహించారు. కాన్వొకేషన్ కమిటీ కన్వీనర్ డాక్టర్ ఎం సుచిత్ర, కో-కన్వీనర్ కె. స్వప్న, ఆహ్వానిస్తున్నారు.