calender_icon.png 16 August, 2025 | 3:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు

07-08-2025 12:53:47 AM

మంచిర్యాల, ఆగస్టు 6 (విజయక్రాంతి) : జిల్లాలో ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని అక్రమంగా విక్రయించిన రెండు రైస్ మిల్లుల యాజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య బుధ వారం తెలిపారు.

హాజీపూర్ మండలం నర్సింగాపూర్‌లోని  శ్రీసాయి మణికంఠ ట్రేడర్స్‌లో 4,108 మెట్రిక్ టన్నులు, నర్సింగాపూర్ గ్రామంలోని శ్రీరాజ రాజేశ్వరి ట్రేడర్స్ లో 8,578 ప్రభుత్వం ధాన్యం లేకపోవడంతో మిల్లు యజమానులపై హాజీపూర్ పోలీస్ స్టేషన్ లలో వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వం ధాన్యంను పక్కదారి పట్టించిన 17 రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని, రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా ఆ మిల్లుల నుంచి ప్రభుత్వ బాకీని వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు.