07-08-2025 12:54:59 AM
బెల్లంపల్లి, ఆగస్టు 6: నెన్నెల మండలంలో తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న జ్యోతి ప్రియదర్శిని మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. జిల్లాలోని అనేక ప్రాంతాలలో తహసీల్దారుగా పనిచేసిన జ్యోతి ప్రియదర్శిని ప్రస్తుతం నెన్నెల తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు.
ఈమె మంచిర్యాల కలెక్టరేట్ సమీపంలో నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి చాతిలో నొప్పి రావడంతో ఒక్కసారిగా ఇంట్లో కూలిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆమె తుదిశ్వాస విడిచారు.