20-12-2025 02:21:55 AM
సంస్థ 30 ఏండ్ల విజయప్రస్థానం పూర్తయినందున ఆత్మీయ సమావేశం
నేడు మినర్వా గ్రాండ్‌లోవేడుకలు
హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): కస్టమర్ల ఆదరాభిమానాలు చూరగొంటూ సీఆర్కే గ్రూప్ మూడు దశాబ్దాలుగా వ్యాపార రంగంలో దూసుకుపోతున్నది. వ్యాపార వృద్ధికి దోహదం చేసిన కస్టమర్లకు సంస్థ కృతజ్ఞతలు తెలుపుతున్నది. మున్ముందు కూడా ఇదే ప్రయాణం కోరుకుంటున్నది. ఈ ప్రయాణంలో భాగంగా సంస్థ 30 ఏళ్లు పూర్తి చేసుకున్నది. ఈ శుభ సందర్భాన యాజమాన్యం కస్టమర్లకు శనివారం రాత్రి విందు ఇవ్వాలని ఆకాంక్షిస్తోం ది. ఆ రోజు సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ కొండాపూర్ సిటీ రోడ్ లోని మినర్వా గ్రాండ్‌లో విందు ఏర్పాటు చేస్తోంది. కస్టమర్లంతా ఈ వేడుకకు హాజరుకవాలని సీఆర్కే గ్రూప్ సాదరంగా ఆహ్వా నిస్తున్నది.