calender_icon.png 13 September, 2025 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట మునిగిన పొలాలు

13-09-2025 07:58:59 PM

ఆదుకోవాలని రైతుల వేడుకలు

మందమర్రి,(విజయక్రాంతి): మండలంలో గత రాత్రి  కురిసిన భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లోని పంట పొలాలు, పత్తి చేలు నీట మునిగి అన్నదాతకు తీవ్ర నష్టం మిగిల్చింది.  శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు మండలం లోని వాగులు పొంగిపొర్లాయి. భారీ వర్షాల మూలంగా మండలంలోని కొండెంగల వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగు నీటి ప్రవాహ దాటికి పంట పొలాలు కొట్టుకు పోయాయి.

మండలం లోని పొన్నారం, ఆదిల్ పేట, వెంకటాపూర్ గ్రామ పంచాయతీల పరిధిలో వరి పొలాలు, పత్తి చేలు నీట మునుగగా నీటి ప్రవాహ దాటికి పంటలు కొట్టుకు పోయాయి. అంతేకాకుండా వాగు నీరు పొలాలకు చేరి ఇసుక మేట వేయడంతో పంట పొలాలు పనికిరాకుండా పోయాయని, ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షాపరమైందని పలువురు రైతులు కన్నీటి పర్యంత మయ్యారు. ప్రభుత్వం రైతులను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని పలువురు రైతులు కోరారు.

ఒరిగిన  విద్యుత్ స్తంభాలు...

గతరాత్రి కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లాయి. వాగు నీటి ప్రవాహ దాటికి సమీపంలోని పంట పొలాలకు వర్షం నీరు చేరాయి. పొలాల మధ్యలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంబాలు వరద నీటికి నేల కూలాయి. వర్షం మూలంగా విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని రైతులు తెలిపారు. విద్యుత్ సరఫరాను అధికారులు నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటుచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని  గ్రామస్తులు, రైతులు కోరారు.