calender_icon.png 12 July, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విరివిగా పంట రుణాలు పంపిణీ చేయాలి

12-07-2025 12:54:26 AM

జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి 

నిజామబాద్, జూలై 11 :(విజయ క్రాంతి)  రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు అంకిత భావంతో కృషి చేస్తూ, తద్వారా ఆయా వర్గాల అభ్యున్నతికి బ్యాంకర్లు దోహదపడాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి యాంకర్లకు సూచించారు. జిల్లాకు వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్నందున పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇ వ్వాలని హితవు పలికారు.నిజామాబాద్ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదా యంలోని కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమా సిక సమావేశం జరిగింది.

ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలు, సా ధించిన ప్రగతి,  ప్రస్తుత వానాకాలం పంటలకు గాను రైతాంగానికి అందించాల్సిన పంట రు ణాలు తదితర అంశాలపై ఆయా బ్యాంకుల వారీగా కలెక్టర్ సమీక్షించారు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రుణ ప్రణాళికను విడుదల చేశారు. వ్యవసాయ, అనుబంధ, వ్యవసాయేతర, ఇతర అన్ని రంగాలకు కలిపి రూ. 17990.59 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు.

ఇందులో ప్రాధాన్యత రంగాలకు రూ. 13928.92 కోట్ల రుణ స దుపాయం కల్పించాలని వార్షిక ప్రణాళికలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ,  పూర్తి స్థాయిలో పంట రుణాల లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంకర్లు చొరవ చూ పాలని,  రుణ పంపిణీ లక్ష్యాన్ని అధిగమించాలని అన్నారు. ఆయా రంగాల్లో పలు బ్యాంకులు లక్ష్యానికి అనుగుణంగా రుణాలు అందిస్తుండగా, మరికొన్ని బ్యాంకులు వెనుకంజలో ఉం డిపోతున్నాయని అన్నారు.

క్రమం తప్పకుండా సమీక్ష జరుపుతూ, వంద శాతం లక్ష్యాల సా ధనకు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు ఉన్నత విద్యను అభ్య సించేందుకు వీలుగా అందుబాటులో ఉన్న రుణ వసతి గురించి వారికి అవగాహన కల్పిస్తూ, ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులకు విద్యా రుణాలను అందించేందుకు చొరవ చుపాలన్నారు. అదేవిధంగా వివిధ వర్గాల అభ్యున్నతి, ఆర్ధిక ప్రగతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాల కింద బ్యాంకర్లు తోడ్పాటును అందించాలన్నారు. 

గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను సమర్ధవంతంగా అందించాలని అన్నారు. వీధి వ్యా పారాలు నిర్వహించే వారికి సూక్ష్మ రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలని, తద్వారా వారు వ్యాపార లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఆర్ధిక తోడ్పాటును అందించినట్లు అవుతుందన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్బీఐ ఎల్.డీ.ఓ రాములు, డీఆర్డీఓ సాయాగౌడ్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ అశోక్ చవాన్, నాబార్డు ఏజీఎం ప్రవీణ్ కుమార్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.