12-07-2025 12:56:14 AM
బాన్సువాడ, జూలై 11 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లాబాన్సువాడ పట్టణంలో రూ.37.50 కోట్లతో నూతనంగా నిర్మించే 100 పడకల ఏరియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహా దారు పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.
అనంతరం పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ముం దర జాతీయ రహదారి పనులలో భాగంగా నిర్మిస్తున్న డ్రైనేజీ కాలువ, ఫుట్ పాత్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.