17-09-2025 11:52:08 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): అర్హులైన రైతులందరికీ పంట రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్ వాన్ అన్నారు. బుధవారం బ్యాంకర్ల తో సమీక్ష సమావేశం కలెక్టర్ నిర్వహించారు. పోడు భూములకు కూడా పంట రుణాలను అందజేయాలని బ్యాంకర్లకు ఆదేశించారు. వరదల వల్ల దెబ్బతిన్న ఎంఎస్ఎంఈ యూనిట్లకు రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు.
DFS ప్రవేశపెట్టిన స్వచ్ఛతహి సేవ కార్యక్రమాన్ని 17 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్,2025 వరకు జరిగే క్యాంపెయిన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించి పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించి భాగస్వాములను చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎల్డీఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ జూన్ త్రైమాసికంలో పంట రుణాలు స్వల్పకాలిక రుణాలు ఎం ఎస్ ఎం ఈ రుణాలు సకాలంలో అందజేశామని ఉద్దేశించిన లక్ష్యాలను సాధించామని తెలిపారు.