18-09-2025 12:58:33 AM
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: భవిష్యత్‌లో జరి గే ఎన్నికల్లో ఈవీఎంల బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్ ఫొ టోల ను కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం నిర్ణయించింది. త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ కొత్త నిబంధనను అమలు చేయనున్నట్టు పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రా లు, కేంద్ర పాలిత ప్రాం తాల చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్లకు నూతన మార్గదర్శకాలు పంపింది.
లోక్‌సభ, అసెంబ్లీల సాధారణ, ఉప ఎన్నికల కోసం ఈసీ ఈవీఎంలను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈవీఎం బ్యాలెట్ పేపర్ల రూపకల్పన, ముద్రణ మార్గదర్శకాలను సవరించిన ఈసీ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఇక మీదట బ్యాలె ట్ పేపర్లపై అభ్యర్థుల కలర్ ఫొటోలు దర్శ నం ఇవ్వనున్నాయి. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా గత ఆరునెలల కాలంలో తీసుకువచ్చి న 28 మార్పుల్లో తాజా నిర్ణయం కూడా భాగమని ఈసీ పేర్కొంది.
అభ్యర్థుల సీరియల్ నంబర్లను 30 ఫాంట్ సైజ్‌తో ముద్రించనున్నారు. అభ్యర్థుల పేర్లతో పాటు నోటా ఆప్షన్ ను కూడా అలాగే ముద్రించనున్నారు. ఈ సీ సవరించిన నిబంధనల ప్రకారం.. అభ్యర్థి ఫొ టోగ్రాఫ్‌ను 2.5 సెంటీమీటర్ల వెడల్పు, ఎత్తు తో ముద్రించాలి. కేటాయించిన స్థలం లో 3/4 వంతు ఫొటోనే ఉండాలి. ఏదైనా ప్రత్యేక సందర్భంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశిస్తే తప్పా.. పార్లమెంట్ ఎన్నికలకు తెలుపు రంగులో, అసెంబ్లీ ఎన్నికలకు గులాబీ రంగులో బ్యాలెట్ పేపర్లు ముద్రించాలి.
బ్యాలెట్ పేపర్ల ముద్రణ కొరకు 70 జీఎస్‌ఎం నాణ్యతతో ఉన్న పేపర్‌నే ఉపయోగించాలి. ఒక బ్యాలెట్ పేపర్లో 15 మంది అభ్యర్థుల కంటే ఎక్కువ మంది పేర్లను ముద్రించొద్దు. నోటా గుర్తు బ్యాలెట్ పేపర్ల చివరన ఉండాలి. ఒక వేళ పోటీ చేసే అభ్యర్థులు, నోటా కలిపితే 16 కంటే తక్కువ ఉంటే కింద ఖాళీ స్థలం వదిలిపెట్టాలి.