15-04-2025 01:16:59 AM
తలకొండపల్లి,ఎప్రిల్ 14: తలకొండపల్లి మండలం లోని ఆయా గ్రామాలలో సోమవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వర్షానికి వివిద రకాల పంటలు దెబ్బతిన్నాయి.చంద్రధన,రాంపూర్ గ్రామాలలో భారీవర్షంతో పాటు వడగళ్ల వాన కురుసింది.ఈ వర్షానికి వరి,మామిడి,కూరగాయ తోటలు బాగా దెబ్బతిన్నాయి.వరి పంట చేతికి వచ్చే సమయంలో వడగళ్ల వర్షం కురియడంతో పంట నేలరాలి రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఈసారి మామిడి కాత అంతంతమాత్రంగానే ఉంది.కాసిన కొద్దిపాటి మామిడికాయలు వడగళ్ల వర్షానికి నెలరాలాయి.కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి.ఈ రెండు గ్రామాలలో పంటల నష్టం అదికంగా ఉంది.మిగతా గ్రామాలలో ఒక మోస్తరు వర్షం కురిసింది.పంటలు దెబ్బతిన్న గ్రామాలలో అదికారులు పర్యటించి పంట నష్టం అంచనాలు వేసి రైతులను ఆదుకోవాలని రైతులు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి,ప్రభుత్వ అదికారులను కోరుతున్నారు.