calender_icon.png 19 May, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇస్కాన్ గురువు కృష్ణదాస్‌కు బెయిల్

01-05-2025 12:01:15 AM

ఢాకా: బంగ్లాదేశ్ పతాకం కంటే ఎక్కువ ఎత్తులో కాషాయ జెండాను ఎగురవేశారనే ఆరోపణలపై బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతని జాగరణ్ జోటె ప్రతినిధి, ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి గతేడాది అక్టోబర్ 30న  చిట్టగాంగ్‌లో అరెస్టయ్యారు. ఈ ఘటనలో బంగ్లా పోలీసులు కృష్ణదాస్ సహా 19 మందిపై కేసులు పెట్టారు. కృష్ణదాస్ అరెస్ట్‌ను ఖండిస్తూ భారత్ సహా పలు దేశాల నుంచి ఆయన మద్దతుదారులు నిరసన వ్యక్తం చేశారు. కృష్ణదాస్ అప్పటినుంచి అనేకసార్లు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయినప్పటికీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. బుధవారం ఎట్టకేలకు ఆయనకు బంగ్లాదేశ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కృష్ణదాస్‌కు భారీ ఊరట లభించింది.