calender_icon.png 2 September, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్‌లో 4.60 కోట్ల అభివృద్ధి పనులు

02-09-2025 12:58:54 AM

 శంకుస్థాపన చేసిన మంత్రి గడ్డం వివేక్, మేయర్ విజయలక్ష్మి

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్‌లో రూ.4.60 కోట్ల వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్లు, మౌలిక సదుపాయాల పనులకు సోమవారం మంత్రి గడ్డం వివేక్ , జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ప్రతి వాడా, బస్తీ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా మంత్రి, మేయర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు మల్ రెడ్డి రాంరెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి, అజారుద్దీన్, నవీన్ యాదవ్, భవాని శంకర్ పాల్గొన్నారు. పెండింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి సూచించారు. అనంతరం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి క్యాంప్ కార్యాలయంలో జిహెచ్‌ఎంసి, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో బంజారాహిల్స్ డివిజన్‌లో పెండింగ్ పనులపైన సమీక్ష నిర్వహించారు. పనులన్నింటినీ త్వరగా పూర్తి చేసి ప్రజలకు  అందుబాటులో కి తీసుకొని రావాలి అని అధికారులను ఆదేశించారు.