calender_icon.png 2 September, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్

02-09-2025 12:36:43 AM

10 కేజీల గంజాయి, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం

ఇబ్రహీంపట్నం: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన దేబ కబాసి (35), జోగి మడకమి (42) వీరిద్దరు బొంగ్లూరు రింగ్-2 వద్ద గంజాయితో వేచి ఉన్నారన్న పక్క సమాచారంతో అరెస్ట్ చేశామన్నారు. వీరిద్దరు మల్కాజ్ గిరికి చెందిన పలాసి నూకరాజు అనే వ్యక్తి వద్ద సుమారు రూ.2.50 లక్షల విలువగల 10 కేజీల గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, హైదరాబాద్, ఆదిభట్ల పోలీసు స్టేషన్ పరిధిలో గల వివిధ కంపెనీలలో పని చేసేవారికి, కాలేజీ విద్యార్థులకు గంజాయిని విక్రయించాలనే పధకం వేశారు. కాగా వీరిద్దరు ఆగస్టు 31, సాయంత్రం బొంగ్లూరు వద్ద పట్టుబడ్డారని తెలిపారు. నిందితుల నుండి 10 కేజీల గంజాయి, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, ఇద్దరి నిందితులను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.