11-09-2025 12:18:16 AM
మంచిర్యాల, సెప్టెంబర్ 10 (విజయక్రాం తి): జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ను బుధవారం సౌత్ సెంట్రల్ రైల్వేస్ సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) డాక్టర్ ఆర్ గోపాలకృష్ణన్ పరిశీలిం చారు. అమృత్ భారత్‌లో భాగంగా జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు.
అలాగే మంచిర్యాలలో వందే భారత్ ట్రైన్ హాల్టింగ్ త్వరలో ప్రారంభించనున్నందున సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట రైల్వేస్ సీనియర్ డివిజనల్ ఇంజనీర్ (నార్త్), సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్, సీనియర్ సిగ్నల్, టెక్నికల్ అధికారులు ఉన్నారు.