10-02-2025 12:00:00 AM
గజ్వేల్, ఫిబ్రవరి 9 : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని నాచగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో ఆదివారం దర్శించుకున్నారు. నిత్య పూజలో భాగంగా స్వామివారి సన్నిధిలో 6 జంటలు స్వామి వారి కళ్యాణములు, 28 జంటలు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, 14 జంటలు అభిషేకములు నిర్వహిం చారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది సుధాకర్, నరేందర్ తగిన ఏర్పాటు చేశారు.