calender_icon.png 29 December, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మోదీ

29-12-2025 02:20:02 AM

కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు

ఉపాధి హామీ నుంచి గాంధీ పేరు తొలగించి.. ఆ పథకాన్ని పూర్తిగా మార్చే కుట్ర చేస్తోంది 

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ 

గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్, డిసెంబర్  28 (విజయక్రాంతి): దేశంలో రాజ్యాంగాన్ని నీరుగార్చి.. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులకు మేలు చేసే విధంగా మోదీ ప్రభుత్వం నిర్ణయా లు తీసుకుంటుందని మండిపడ్డారు. జాతీయ ఉపా ధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగించి .. ఉపాధి హామీ పథకాన్ని మార్చాలనే కుట్ర చేస్తోందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల త్యా గంతోనే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఆదివారం గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి, అజారుద్దీన్, పార్టీ నేతలు హాజరయ్యారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి ఇందిరా, రాజీవ్ గాంధీలే కారణమన్నారు. ఈ  సందర్భంగా మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ ప్రపంచలోనే అత్యంత పురాతనమైనది కాంగ్రెస్ పార్టీ అన్నారు. అనేక మంది మహనీయుల సంకల్పంతో ఏర్పడిందని, స్వాతంత్య్ర పోరాటం, దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర ఎనలేదని మహేష్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. మహనీయుల త్యాగం ముందు అధికార దాహంతో రాజ్యమేలుతున్న నాయకలు ఎంత ..? అని ఆయన నిలదీశారు. నెహ్రూ ప్రధాని కాకుండా ఉండి ఉంటే ఈ దేశం ఏమయ్యేదో ఊహించలేమని, ఆయన పోషించిన పాత్ర వల్లే దేశం ఈ స్థాయికి ఎదిగిందన్నారు.

పాకిస్తాన్‌కు ఇందిరాంగాంధీ అంటే గడగడలాడే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు మోదీ మాత్రం పాకిస్తాన్‌కు భయపడుతున్నారని విమర్శించారు. ప్రతి ఒక్కరిలో స్మార్ట్ పోన్ ఉండటానికి కారణం రాజీవ్‌గాంధీ దూరదృష్టినేనని అన్నారు. పీవీ నరసింహారావు దేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. ఆ తర్వాత మన్మోహన్‌సింగ్, సోనియాగాంధీ మదిలో నుంచి పుట్టిన మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. పేద ప్రజలకు ఉపయోగపడేలా ఉపాధి పథకాన్ని తీసుకొస్తే.. మోదీ ప్రభుత్వం ఆ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. అన్ని వర్గాలకు సమానంగా ఫలాలు అందాలనే ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కుల సర్వే నిర్వహించిందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చూస్తే .. బీజేపీ అడ్డంపడిందన్నారు. బీజేపీ విధానాలకు బీఆర్‌ఎస్ వంతపాడుతోందన్నారు.