29-08-2025 12:40:29 AM
ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సిన సీఎస్
రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు సర్వీస్ పొడిగించిన కేంద్రం
హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీ కాలం ఏడు నెలలు పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31తో ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో రామకృష్ణారావు సర్వీసును పొడిగించాలని డీవోపీటీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు రామకృష్ణారావు సర్వీస్‌ను మార్చి వరకు పొడగిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది.
గత ప్రభుత్వంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా రామకృష్ణారావు విధులు నిర్వహించగా, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. సర్వీస్ పొడిగింపుతో వచ్చే మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి అన్ని అంశాలను రామకృష్ణారావే చూసుకునే అవకాశం ఉంది.