calender_icon.png 29 August, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా హైబిజ్ టీవీ ఫుడ్ అవార్డుల ప్రదానోత్సవం

29-08-2025 02:24:53 AM

  1. అభినందనలు తెలిపిన పర్యాటక శాఖమంత్రి జూపల్లి 
  2. ముగ్గురికి లెజెండ్ పురస్కారాలు అందజేత

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 28 (విజయక్రాంతి): హై బిజ్ టీవీ ఫుడ్ అవార్డుల ప్రధానోత్సవ నాల్గవ ఎడిషన్ మంగళవారం హైదరాబాద్‌లోని హెఐసీసీ నొవాటల్‌లో అట్టహాసంగా జరిగింది. పర్యాటకశాఖ మం త్రి జూపల్లి కృష్ణారావు, వీడియో సందేశాన్ని పంపించారు. ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాన్ని నిర్వహించినందుకు హైబిజ్ టీవీకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

తెలంగాణ సంస్కృతిని ప్రపంచదేశాలకు తెలిపేం దుకు, తెలంగాణలో పర్యాటకం అభివృద్ధి చెందడానికి ఇలాంటి కార్యక్రమాలు అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఓహ్రీస్ సంస్థ నుంచి రవికుమార్, వివాహ భోజనంబు నుంచి వెంకట రామరాజు, సింప్లీ సౌత్ నుంచి షెఫ్ చలపతి రావు లెజెండ్ పురస్కారాలు అందుకున్నారు. ఫుడ్ ఇండస్ట్రీ నుంచి పలు కేటగిరీల్లో మరో 50 మందికి పైగా అవార్డులు అందాయి.

కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన టీజీటీడీసీ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, సెలబ్రిటీ గెస్ట్‌గా మిస్ యూనివర్స్ తెలంగాణ కష్వీ, జెమినీ ఎడిబుల్స్ అం డ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ పీ చంద్రశేఖర్‌రెడ్డి అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైబిజ్ టీవీ ఎండీ ఎం రాజ్‌గోపాల్, ఎల్‌ఎల్‌పీ తెలుగునౌ డైరెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు.