calender_icon.png 29 August, 2025 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

29-08-2025 02:21:20 AM

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 28 (విజయక్రాంతి): తెలంగాణవ్యాప్తంగా ఉన్న దళిత విద్యార్థుల తల్లిదండ్రులు గతంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌ని కలసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివే తమ 64 మంది పిల్లల అడ్మిషన్లు, ఫీజు బకాయి లు రూ.18కోట్లు, స్టేషనరీ బకాయిలు రూ. 21 లక్షలు, స్కాలర్‌షిప్ బకాయిలు రూ.10 లక్షలు విడుదలకు సహకరించాలని వినతిపత్రం అందజేశారు.

విషయాన్ని ఎమ్మెల్యే శ్రీగణేశ్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమ స్య పరిష్కారించాలని కోరారు. స్పందించిన డిప్యూటీ సీఎం సంబంధిత బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు వారి సమస్యలను పరిష్కరించారు. గురువారం ఎమ్మెల్యే శ్రీగణేశ్ నివాసానికి విషయాన్ని తెలియజేశారు.