calender_icon.png 29 August, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేలుళ్లకు ఎవరు అనుమతి ఇచ్చారు?

29-08-2025 12:38:30 AM

స్పష్టమైన విధి విధానాలు ఉండాలి

ఇళ్ల నిర్మాణంలో భారీ పేలుళ్లపై విచారణలో హైకోర్టు జస్టిస్ ఏకే సింగ్

విచారణ 16కు వాయిదా  

హైదరాబాద్, ఆగస్టు 28(విజయక్రాంతి)ః ఇళ్ల నిర్మాణంలో పేలుళ్లకు సంబంధించి స్పష్టమైన విధి విధానా లు ఉండాలని తెలంగాణ హైకోర్టు జస్టిస్ ఏకే సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు దాఖలైన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లోని న్యాయ విహార్ సమీపంలో పేలుళ్లకు ఎవరు అనుమతి ఇచ్చారని  హైకోర్టు సీజే జస్టిస్ ఏకే సింగ్ ప్రశ్నించారు.

పోలీసుల అనుమతితో పేలుళ్లు నిర్వహించామని గనుల శాఖ తరఫు న్యాయవాది తెలపగా.. బ్లాస్టింగ్ తీవ్రత, రాళ్లు ఎంత దూరం పడతయానే అంశాలపై పోలీసులకు అవగాహన ఉంటుందా అని సీజే ప్రశ్నించారు. సిటీ పోలీస్ యాక్ట్ కింద అనుమతి ఇచ్చినట్లు చెబుతున్నారని.. నగరంలో భారీగా నిర్మాణాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఇళ్ల నిర్మాణంలో భాగంగా భారీ పేలుళ్లు నిర్వహిస్తున్నారని సీజే ధర్మాసనానికి ఓ న్యాయమూ ర్తి ఓ లేఖ రాశా రు.

భారీ పేలుళ్లతో చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ న్యాయమూర్తి   లేఖలో పేర్కొన్నారు. గుట్టలను యథేచ్ఛగా తొలగించడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందోన్నారు. ఆ లేఖను ధర్మాసనం గతేడాది సెప్టెంబర్‌లో సుమోటా తీసుకుని విచారణ చేపట్టింది.

తాజాగా మరోసారి విచారణ సందర్భంగా అనుమతితోనే పేలుళ్లు నిర్వహించారని.. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల లోపు బ్లాస్టింగ్ అనుమతి ఉం దని ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు ఆయన సమయం కోరారు. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు సెప్టెంబర్16కు వాయిదా వేసింది.