06-12-2025 12:00:00 AM
స్వచ్ఛంద సంస్థవారి ప్రత్యేక కార్యక్రమం
హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): వెన్నెముక కండరాల క్షీణత కలిగిన వారితో సహా దివ్యాంగులకు క్యూర్ ఎస్‌ఎమ్‌ఎ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా “ఇస్వ యం” పేరిట ఓ వినూత్న అప్లికేషన్ను అభివృద్ధి చేస్తోంది. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని హైటెక్ సిటీలోని హోటల్ రెడ్ ఫాక్స్లో ఇ - స్వయం డిజి టల్ యాక్సెసిబిలిటీ మ్యాప్ ప్రివ్యూ, సాఫ్ట్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ చీఫ్ ఇంజనీర్ వై సాయపరెడ్డి, యూఎన్‌డీపీ డెవలప్మెంట్ గోల్స్ స్పెషలిస్ట్ - సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్, మొ బిలిటీ, అలగప్పన్, టీఎస్‌ఐజీ మాజీ డైరెక్టర్, సన్లిట్ పాత్ కన్సల్టింగ్ సీఈవో అర్చన సురే ష్, రెయిన్బో హాస్పిటల్ పీడియాట్రిక్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ విద్యా సాగర్ పాల్గొ న్నారు. భారత ప్రభుత్వ పిడబ్ల్యుడి విభాగం డిప్యూటీ చీఫ్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ అంబష్ట (వర్చువల్)లో పాల్గొన్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇండియన్ కోస్ట్ గార్డ్, హెచ్‌ఎంఆర్‌ఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, సీఎస్‌ఐఆర్‌సీసీఎంబీ, సౌత్ కోస్ట్ రైల్వేస్ నుండి నిపుణులు జాతీయ యాక్సెసిబిలిటీ మ్యా పింగ్ ఎకోసిస్టమ్ యొక్క పరివర్తన సామర్థ్యాన్ని చర్చించారు.
ఇస్వయం.. భారతదేశ డిజిటల్ యాక్సెసిబిలిటీ మ్యాప్ కమ్యూనిటీ, సాంకేతికతఆధారిత పబ్లిక్ ప్లాట్ఫామ్‌గా ఇస్వయం రూపొందుతోంది. భారతదేశం అంతటా యాక్సెసిబిలిటీ స్థితిగతుల్ని మా ర్చాలని ఫౌండేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది తొలుత ఈ ఏడాది మొబిలిటీ యాక్సెసిబిలిటీతో ప్రారంభమవుతుంది దశలవారీగా 2027 నాటికి అన్ని రకాల వైకల్యాలకూ సేవ లు అందించేలా విస్తరిస్తుంది. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, సంరక్షకులు కుటుంబాలు, విధాన నిర్ణేతలు, పట్టణ ప్రణాళి కదారులు, సంస్థలకు వీల్ ఛైర్ వినియోగంపై ఇస్వయం మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. చెన్నైకి చెందిన వై స్క్వేర్ టెక్నాలజీస్ సహకారంతో ఈ వేదికను అభివృద్ధి చేస్తున్నారు.