06-12-2025 12:00:00 AM
మేడ్చల్ అర్బన్ డిసెంబర్ 5 (విజయక్రాంతి): వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా మేడ్చల్ పట్టణంలో సకల జనులతో వందేమాతరం గీతాన్ని సామూహికంగా పాడడం జరిగిందని కమిటీ సభ్యులు పాతూరి సుధాకర్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో దేశం లేని ప్రతి పౌరుడు దేశం కోసం నిస్వార్ధంగా పని చేయాలని దేశాభివృద్ధికి పాటు పడాలని ప్రతిజ్ఞ చేయించడం జరిగిందన్నారు.
లక్షల మంది దేశభక్తుల ప్రాణ త్యాగాలతో ఏర్పడ్డ భారతదేశాన్ని సుసంపన్నంగా అభివృద్ధి జరిగే విధంగా దేశ హితం రక్షణ కోసం రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు నిస్వార్ధంగా దేశభక్తితో పనిచేయాలని కోరినట్లు సుధాకర్ రెడ్డి తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహక కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ తాళ్లపల్లి మురళీధర్ గుప్తా, రాళ్లపల్లి రాజేశ్వర్ గురుస్వామి, పెంజర్ల మల్లేష్ యాదవ్, స్వామి కురుమ అవినాష్ గౌడ్, రఘురాం పటేల్, లక్ష్మణ్ ప్రభు, కానుకంటి వంశీ వంజర, జాకట బాబు రాజ్ తదితరులు పాల్గొన్నారు.