calender_icon.png 31 August, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్తీ కోళ్ళ దాన తయారు చేస్తున్న నిందితులు అరెస్ట్

30-08-2025 10:58:02 PM

వివరాలు వెల్లడించిన  శాలిగౌరారం సిఐ కొండల్ రెడ్డి

నకిరేకల్,(విజయక్రాంతి): అక్రమ సంపాదనకు ఆశపడి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ   కోళ్ల కు కల్తి దాన ను తయారు చేస్తూ పట్టుబడిన నిందితులును ఆల్టాస్ సతీష్ ,బుద్దే కృష్ణ  వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు శనివారం  శాలిగౌరారం సిఐ కొండల్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. తెలిపిన వివరాల ప్రకారం ఈనేల 29న కేతేపల్లి పంచాయతి ఇన్చార్జి సెక్రటరీ సయ్యద్ బాబా  కేతేపల్లి గ్రామా శివారులో సత్తి రెడ్డి పాత మిల్లు లో కల్తీ దాన తయరుచేస్తున్నారని  ఫిర్యాదు  ఇచ్చారని ఆయన తెలిపారు. 

కేసు నమోదు చేసుకొని,  నల్గొండ డిఎస్పికే శివరాం రెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు చేయగా గత కొంత కాలంగా కేతేపల్లి గ్రామా శివారులో గల సత్తి రెడ్డి పాత మిల్లు కిరాయికి తీసుకొని, అట్టి మిల్లులో నేరస్థులైన ఆల్ట్రాస్ సతీష్ & బుద్దే కృష్ణలు కోళ్ళ దాన సరఫరా వ్యాపారం చేస్తూ అక్రమంగా అధిక డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో కోళ్ళ దాన తయారు చేయుటకు ఉపయోగించే తౌడు, సన్నని నూకలను చుట్టూ పక్కల రైస్ మిల్లుల నుండి కొనుగోలు చేసి దానిలో అధిక బరువు కోసం 30% సన్నని ఇసుకను కలిపి, కల్తీ దానను తయారు చేసి, కోళ్ళకు, మానవుల ఆరోగ్యానికి హాని ఉంటదని తెలిసి కూడ ఎలాంటి రశీదులు లేకుండా అట్టి కల్తి దాను TG-05-T-3696 నెంబర్ గల డిసియంలో లోడ్ చేసుకొని హైదరాబాద్ తరలించి చుట్టూ పక్కల కోళ్ళ ఫారం యజమానులకు మోసపూరితంగా అధిక ధరకు అమ్ముతూ సులభంగా డబ్బులు సంపాదిస్తున్నారని ఆయన తెలిపారు. 

ఇసుక కలిపిన కల్తీకోళ్ళ దాని వ్యాపారం చేయడం వల్ల, కోళ్లకే కాకుండా మనిషి ఆరోగ్యానికి ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుందన్న తెలిపారు.పరిశోదనలో భాగంగా కల్తీ లోడ్ వున్నా TG-05-T-3696 నెంబర్ గల డి.సి.యం ని, కల్తీ కోసం ఉపయోగించిన ఇసుకను, నూకలను మరియు కొన్ని కల్తీ కోళ్ళ దాన వున్నా సంచులను  మొత్తం 122.5 క్వింటాల సీజ్ చేశామని అని తెలిపారు. సీజ్ చేసిన కల్తీ దాన విలువ సుమారు 3,30,000/- రూపాయలుఉంటుందన్నారు. ఈ కేసులో ఎ-1, ఎ-2 నిందితులుగా నిందితులుగా కేతేపల్లి మండలం చీకటి గూడెం గ్రామానికి చెందిన ఆల్టాస్ సతీష్, బుద్దే కృష్ణ ఈరోజు నేరస్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి రెండు సెల్ ఫోన్ లు, TS-05-FL-0434 నెంబర్ గల టాటా నెక్సన్ కారు స్వాదీన పరుచుకున్నామని వారు తెలిపారు.ఇట్టి నేరస్థులను పట్టుబడి చేయుటలో డి.ఎస్.పి కె.శివరాం రెడ్డి, పర్యవేక్షణలో శాలిగౌరారం సి.ఐ  కె. కొండల్ రెడ్డి, కేతేపల్లి యస్.ఐ యు.సతీష్, మరియు ఇతర సిబ్బందిని జిల్లా యస్.పి. శ శరత్ చంద్ర పవార్, ఐపిఎస్ ప్రత్యేకముగా  వారిని అభినందించారు.