calender_icon.png 22 December, 2025 | 8:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిట్‌నెస్‌కు సైక్లింగ్ ఉత్తమ మార్గం

22-12-2025 12:00:00 AM

జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి పరంధామ రెడ్డి

కొత్తగూడెం, డిసెంబర్ 21: (విజయక్రాంతి)కేంద్ర ప్రభుత్వం, స్పోరట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అమలవుతున్న ఫిట్ ఇండియా మిషన్ కార్యక్రమంలో భాగంగా, స్పోరట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో ఫిట్ ఇండియా సన్డే సైక్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి పరంధామ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కొత్తగూడెం పట్టణంలో సన్డే సైక్లింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థినీ, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా విజయవంతం చేశారు.సైక్లింగ్ వంటి శారీరక వ్యాయామాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ప్రజల్లో ఫిట్నెస్పు అవగాహన పెంపొందించడం, అలాగే ఫిట్ ఇండియా మిషన్లో భాగంగా సైక్లింగ్ కార్యకలాపాలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రటరీ నరేష్, సైక్లింగ్ అసోసియేషన్ సెక్రటరీ బీవీజీ కృష్ణ, నాగేశ్వర్ రావు, ఉదయ్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్లు కవిత, శైలజ, కాంచనపల్లి స్పోరట్స్ స్కూల్ హెడ్మాస్టర్, తదితరులు పాల్గొన్నారని తెలిపారు.