22-12-2025 12:00:00 AM
ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించిన పాల్వంచ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ విద్యార్థినులు..
ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ విభాగ విజేత అన్నంకు సన్మానం
పాల్వంచ, డిసెంబర్ 21, (విజయక్రాంతి): వరంగల్లో ఈనెల 19 , 20 తేదీల్లో నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ ఇంట ర్ కాలేజ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ విద్యార్థినులు అసాధారణ ప్రతిభను కనబరిచారు. వివిధ విభాగాలలో పోటీపడి మొత్తం 35 పాయింట్లు సాధించి,19 పతకాలు గెలుపొందారని, ఇందులో 7 బంగా రు పతకాలు 1 రజిత పతకం 11 కంస్య పతకాలతో యూనివర్సిటీలో ఒవరాల్ ఛాంపి యన్షిప్ టైటిల్ను అందిపుచ్చుకోవడం గమనార్హం.
ఈ ఘన విజయం సాధించిన విద్యా ర్థినులను ఆదివారం పాల్వంచ పట్టణంలోని శ్రీనివాస కాలనీలో ఉన్న మినీ స్టేడియంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అభినందించారు. విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపి, వారి కృషి, క్రమశిక్షణ, పట్టుదల మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని కలెక్టర్ ప్రశంసించారు. అదేవిధంగా ఇటీవల 55 సంవత్సరాల పైబడిన విభాగంలో జాతీయ స్థా యి టెన్నిస్ పోటీల్లో విన్నర్ కప్ సాధించిన అన్నం వెంకటేశ్వర్లును కలెక్టర్ ప్రత్యే కంగా శాలువాతో సత్కరించారు.
ఆయన సాధించిన విజయం యువ క్రీడాకారులకు ఆదర్శమని కొనియాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ తన స్కూల్, కాలేజ్ రోజుల జ్ఞాపకా లను గుర్తుచేసుకొని ముచ్చటించారు. క్రీడ ల్లో రాణించడం ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరు గుతాయని పేర్కొంటూ, విద్యా ర్థులు జాతీ య, అంతర్జాతీయ స్థాయిలో మరింత రాణించేందుకు అవసరమైన సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భం గా అథ్లెటిక్ కోచ్ పి. నాగేంద్రబాబుకు సన్మా నం జరిగింది. జిల్లాలో ట్రాక్ అండ్ ఫీల్ అభివృద్ధి కోసం జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ చేస్తున్న సేవలను జిల్లా కలెక్టర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్వో పరంధామ రెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ మహీధర్, ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ నరేష్, కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ, అథ్లెటిక్స్ కో చ్ నాగేంద్రబాబు, టెన్నిస్ కోచ్ డానియల్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.