calender_icon.png 30 September, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధ్వంసమైన రోడ్లను నూతనంగా నిర్మించాలి

30-09-2025 01:52:34 AM

  1. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కదిలిన ప్రజా పాదయాత్ర

దుమ్ముగూడెం మండల కేంద్రం నుండి భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగుతున్న ప్రజా పాదయాత్ర

నూతన రోడ్డును నిర్మించే వరకు పోరాటం ఆగదు ...సీపీఎం నేతల ప్రకటన

భద్రాచలం, సెప్టెంబర్ 29, (విజయక్రాంతి):ఇష్టం వచ్చినట్లు తిరిగిన ఇసుక లారీల వల్ల చర్ల నుండి భద్రాచలం వరకు ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసం అయిందని, ప్రభుత్వం వెంటనే కొత్త రహదారి నిర్మించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దుమ్మగూడెం మండలం లక్ష్మీపురం నుండి భద్రాచలం వరకు పాదయాత్రను ప్రారంభించారు.

సోమవారం ఉదయం ప్రా రంభమైన ఈ మహా పాదయాత్ర కు మార్గమధ్యలోని గ్రామ గ్రామంలో గ్రామస్తులు స్వాగతం పలికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రధాన రహదారి పై ప్రతినిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయని అటువంటి రహదారిని ఇసుక లారీలు పూర్తిగా ధ్వంసం చేశాయని దీనివల్ల ప్రజలు ముఖ్యంగా ఆరోగ్యం కోసం భద్రాచలం వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.

ఉన్న ప్రజా ప్రతినిధులు ఎవ రు ధ్వంసం అయిన రోడ్డును గురించి పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఏ ప్రాంతం లో ఇసుక ర్యాంపులు నిర్వహించిన ఆ ప్రాం త రోడ్ల నిర్వహణ బాధ్యత వారికే ఉంటుందని అయితే ప్రస్తుతం ఉన్న ఇసుక కాంట్రా క్టర్లు డబ్బులు దండుకోవడమే తప్ప రోడ్ల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

రోడ్లు ధ్వంసం అవుతున్న ఉ న్నత స్థాయి తో పాటు పలువురు అధికారు లు ఎవరు కూడా చర్యలు తీసుకోవడం లేద ని తెలిపారు. ఇప్పటికైనా స్పందించి ధ్వంసం అయిన రోడ్డును తిరిగి కొత్త రోడ్డుగా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర నిర్వహించారు.అయితే ఉదయం ప్రారంభమైనప్పటికీ స్థానిక ఎన్నికల ప్రకటన రావ డంతో పాదయాత్ర మార్గ మధ్యలో తూర్బా క  చేరుకోవడంతో అక్కడ ఆపివేసి అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

ఈ పాద యాత్రలోసిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు- సీనియర్ నాయకులు కామ్రేడ్ యలమంచిలి రవికుమార్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కారం పుల్లయ్య, ఎంబి నర్సారెడ్డి, రేపాకుల శ్రీనివాస్ కే బ్ర హ్మచారి, యలమంచి వంశీ, గడ్డం స్వామి, చిలకమ్మ , మర్మం చంద్రయ్య, బండారు శర త్, గంగ , మచ్చా రామారావు మరియు సిపి ఎం చర్ల మండల కమిటీ, దుమ్ముగూడెం మండల కమిటీ ,భద్రాచలం పట్టణ కమిటీ నాయకత్వం అందరూ అగ్రభాగాన పాదయాత్రలో నడుస్తూ, నాయకత్వం వహించారు.