30-09-2025 01:50:10 AM
కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండును ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 29, ( విజయక్రాంతి): అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణలోపంవల్లే ఆర్టీసీ బస్టాండు అసౌకర్యాల కు నిలయంగా మారిందని, అధికారులు తీ రు మార్చుకొని సౌకర్యాల మెరుగుపై ద్రుష్టి సారించాలని కొత్తగూడెం శాసనసభ సభ్యు లు కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండును అయన ఆకస్మికంగా సందర్శించారు.
అసౌకర్యాలపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడు తూ జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ఆర్టీసీ బ స్టాండుకు నిత్యం వేలాదిమంది ప్రయాణికులు వాచిపోతుంటారని, త్రాగునీటి సౌక ర్యం, మరుగుదొడ్ల నిర్వహణ లోపం, ఆవర ణ పారిశుద్ధ్య లోపం స్పంష్టంగా కనిపిస్తోందని దీన్ని సరిచేయాల్సిన అధికారులు నిర్ల క్షయంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
సి బ్బందిని వేదించడంపైనే ద్రుష్టి సారిస్తున్న విషయం తనదృష్టికి వచ్చిందని, దీన్ని సరిచేసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందితే చర్యలకు సిఫారసు చేతనాని తెలిపా రు.
గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం క ల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూ చించారు. బస్టాండు నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధుల కో సం ప్రభుత్వానికి నివేదించడం జరిగిందని, త్వరలో నిధులు మంజూరవుతాయని తెలిపారు. కూనంనేని వెంట సిపిఐ జిల్లా కార్యద ర్శి ఎస్ కె సాబీర్ పాషా, ఎంప్లాయిస్ యూ నియన్ రాష్ట్ర నాయకులు కందుల భాస్కర్, ఆర్టీసీ అధికారులు వున్నారు.