14-12-2024 04:58:50 PM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గురుకుల పాఠశాలలో కామన్ డైట్ మెనూ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ హాజరయ్యారు. గురుకులంలో పారిశుధ్య పరిస్థితులను దాన కిషోర్ పరిశీలించారు. గురుకుల విద్యార్థులకు ఐఐటీ, నీట్ కోచింగ్ ఇప్పిస్తామని ఆయన పేర్కొన్నారు. సీఎస్ఆర్ నిధులతో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని వెల్లడించారు.