calender_icon.png 20 October, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీ గూడేల్లో ఘనంగా దండారి ఉత్సవాలు

20-10-2025 01:23:28 AM

సాంప్రదాయ వస్త్రాలతో గుస్సాడి నృత్యాలు చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఆదిలాబాద్, అక్టోబర్ 1౯ (విజయక్రాం తి): దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసీ గూడల్లో కన్నుల పండుగ దండారి (గుస్సా డి) ఉత్సవాలు జరుగుతున్నాయి. దండారి ఉత్సవాల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆదివారం ఉట్నూర్ మండల కేంద్రంలో పాత ఉట్నూర్ లోని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నివాస ప్రాంతంలో ఏర్పాటు చేసిన దండారి ఉత్సవంలో రాజాం పేట, తక్కుగూడ, కల్లూరు గూడ, దుర్గాపూర్ దండారి లు పాల్గొన్నాయి.

దండారిలో కోలాటం, కచాయి కోలా, రేల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణలో నిలిచాయి. దండారి ఉత్సవంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సైతం పాల్గొన్నారు. ఆదివాసీ సాంప్రదాయ వస్త్రాలను ధరించిన ఎమ్మెల్యే తమ ఆదివాసుల తో కలిసి ఉత్సాహంగా గుస్సాడి నృత్యాలు చేశారు. దండారి లను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి దండారి నృత్యాలను ఆసక్తిగా తిలకించారు.

గిరిజన తండాల్లో...

నిర్మల్ (విజయక్రాంతి):  సారంగాపూర్ మండలం పెండల్‌దరి గ్రామంలో ఆదివా రం దండారి పండగ చాలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గుస్సాడీ వేషధారణలో శ్రీహరి రావుకి ఘన స్వాగతం పలికారు. శ్రీహరి రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని గొండ్ తెగ వారు తమ సంప్రదాయ పండుగ దం డారిని ఎంతో ఉత్సాహంగా, ఆచార విశ్వాసాలతో, సాంప్రదాయ పద్దతుల్లో నిర్వహిం చడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారని,

గ్రామంలోని గుస్సాడీ ముత్యాలు, గుస్సాడీ వేషధారణలో ఉన్న యువకులు పల్లె వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారన్నా రు. పల్లెలో అంగరంగ వైభవంగా వెలుగు లు, సంగీతం, నృత్యాలతో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు.ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు శ్రీహరి రావు పాల్గొని, గుస్సాడీలతో కలిసి నృత్యం చేస్తూ వారిని ప్రోత్సహించారు.

గొండ్ తెగ ప్రజల దండారి పండుగ,ఆదివాసీ సాంప్రదాయ, సంస్కృతి, ఐక్యతకు ప్రతీక. ఈ పండుగను తరతరాలు గా కొనసాగించడం మన సమాజ గౌరవాని కి సూచిక. ఇలాంటి సాంప్రదాయ పండుగలు సమాజంలో ఐకమత్యం, సంతోషం, ఆనందం నింపుతాయి, అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ ఆది, మం డల నాయకులు, మధుకర్ దాసరి రమేష్, అడెల్లి ఆలయ ధర్మకర్త భోజన్న, పోత న్న,రాజేశ్వర్ ముత్యం రెడ్డి, పార్ పెళ్లి మాజీ సర్పంచ్ ప్రతాపరెడ్డి, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.