calender_icon.png 20 October, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కపాస్ కిషన్‌యాప్‌తో రైతులకు ఇబ్బందులు

20-10-2025 01:21:46 AM

  1. దశలవారీగా యాప్‌ను అమలు చేయాలి
  2. రైతులు ఎవరు దళారులకు పంట అమ్మి మోసపోవద్దు 
  3. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన  ఎమ్మెల్యే అనిల్ జాదవ్

ఆదిలాబాద్, అక్టోబర్ 1౯ (విజయక్రాం తి): కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన కపాస్ కిసాన్ యాప్‌పై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన లేనందున ఈ యాప్ పద్ధతిలో కొనుగోలును దశలవారీగా అమ లు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బోథ్ నియోజకవర్గంలోని బోథ్, ఇచ్చోడ మండల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఆదివారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

ముందుగా తూకం కాంటాలకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత, పంటను అమ్ముకునేందుకు వచ్చిన తొలి రైతులను సన్మానించి కొనుగోలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతుల మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని అన్నారు. మొక్కజొన్న తో పాటు సోయాబిన్, పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని పేర్కొన్నారు. కపాస్ కిషన్‌యాప్ ద్వారా రైతులకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఆ యాప్ ఇప్పుడే అమలు చేయకుండా క్రమక్రమంగా యాప్ అమలు మొదలు పెట్టాలని సూచించారు. 

చాలా మంది రైతుల వద్ద సెల్ ఫోన్లు లేవనీ, ఫోన్ లు ఉన్న నెట్వర్కులు లేవనీ, కావున ఈ ఒకటి రెండు సంవత్సరాలు పాత పద్ధతి ద్వారానే పత్తి కొనుగోలు చేయాలి అని అన్నారు. అదేవిధంగా రైతులు ఎవరు దళారులకు పంట అమ్మి మోసపోవద్దు అని సూచించారు. త్వరలోనే ఈ ప్రభుత్వంతో పోరాడి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే విధంగా చేస్తాను అని అన్నారు.  ఈ కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.