calender_icon.png 20 October, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చీకటి వెలుగుల రంగేళి

20-10-2025 01:25:18 AM

  1. జీవితమే ఓ దీపావళి

నేడు దీపావళి పండుగ

ధనలక్ష్మి పూజలు, నోములు, వ్రతాలు

కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 1౯ (విజయక్రాంతి): ఆశ్వీజ బహుళ అమావాస్యనాడు వచ్చేది దీపావళి దీపావళి పండుగ వస్తుంది అంటే వారం రోజుల నుండే ఇంటి ని, వ్యాపారులు వారివారి వ్యాపార సముదాయాలు కడుగుతారు. దీపావళి నాడు ప్రతి ఒక్కరి ఇండ్లలో, వ్యాపార సముదాయాలలో లక్ష్మీ పూజలు,కేదారిశ్వరా నోములు నిర్వహిస్తారు. ఇంటికి తోరణాలు,  తీరైన పూలు, రంగులు వెదజల్లే తీరైన లైటింగులు లతో అలంకరిస్తారు.

ఇండ్లలో నోములు లక్ష్మి పూజలు కోసం తీరైన పిండి వంటకా లు తయారు చేస్తారు. పండుగ సందర్భంగా ఇతర ప్రాంతాలలో ఉండే వారు సొంత గ్రామాలకు చేరుకొని పండుగను ఆనందోత్సవాల మధ్య టపాసులు టపాసులు కాలు స్తూ పండుగను జరుపుకుంటారు. 

పండుగ వెనుక ఇతిహాసం..

ద్వాపరయుగంలో ప్రాగోతిస్టపురం రాజదానిగా నరకాసురుడు పరిపాలన చేస్తూ దేవ, మానవజాతిని ఇబ్బందులకు గురి చేసేవాడు ధర్మానికి భంగం కలిగించే పనులకు సహించని భూమాత, దేవతలు అందరూ కలిసి శ్రీకృష్ణుని విన్నవించుకుంటారు.

శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి ఆశ్వీయుజ చతు ర్థి నాడు నరకాసురుని అంతం చేస్తాడు అది నరక చతుర్థి నరకాసుర వధనతరం వచ్చిన సత్యభామ కృష్ణులకు అమావాస్య (చీకటి రోజు) నాడు ప్రజలు దీపాలను వెలిగించి మంగళహారతులు ఇచ్చి భాజా భజత్రి లతో స్వాగతం పలుకుతారు. ఆనాటి నుండి దీపావళిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

టపాసులు మోతలు...

దీపావళి అనగానే వివిధ ఆకృతులలో ఉన్న ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు.వరుసగా మూడు నాలుగు రోజులపాటు దీపా లు వెలిగించి ఆ కాంతుల మధ్య వెలిగిపోతున్న గృహాలను చూసుకొని మురిసిపో తారు. అమావాస్య తిథి లక్ష్మీదేవికి ఇష్టం కావడంతో దీపాలు వెలిగించి అమ్మవారికి పూజలు చేసి ఆహ్వానిస్తే ధనలక్ష్మి కృప ఉం టుందని విశ్వసం.

అనంతరం వివిధ రకాల టపాసులను కాల్చి చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందంగా గడుపుతారు.  దీపావళి పండు గ సందర్భంగా బుధవారం రోజున సందడి నెలకొందది. ప్రమిదలు, బంతిపూలు, ఇంటి అలంకరణ కోసం వాడే లైటింగ్ సెట్లు కొనుగోలు చేసేందుకు జనాలు జిల్లా కేంద్రానికి వచ్చారు. అలాగే పండుగ కావడంతో కిరాణా  సముదాయాలలో రద్దీ నెలకొంది.

బెల్లంపల్లిలో దీపావళి సందడి.!

బెల్లంపల్లి, అక్టోబర్ 19: దీపావళి పండు గ సందర్భంగా ఆదివారం బెల్లంపల్లి పట్టణం పూలు, బొమ్మలు, పూజా సామాగ్రి అమ్మకాలతో సందడిగా మారింది. బెల్లంపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ నుండి అంబేద్కర్ కాంటా చౌరస్తా వరకు వివిధ రకాల పూలు, రంగురంగుల దీపావళి బొమ్మలతో కళకళలాడింది.

పూజా సామాగ్రితో పాటు పువ్వుల విక్రయాల కోసం కుటుంబాలతో సహా వచ్చిన మహిళలతో పట్టణమంతా రద్దీగా మారింది. ప్రతి ఇంట్లో కేదారేశ్వర నోములు జరుపుకునే పండుగ కావడంతో కొబ్బరికాయలు, పండ్లు, నూతన వస్త్రాలు, గృహాలంకరణ వస్తువుల విక్రయాలు జోరుగా సాగాయి. పట్టణంలోని పలు దేవాలయాలు పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలకు ముస్తాబయ్యాయి.