15-07-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, జూలై 14: ఆరోగ్యంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమైంది. సిగరేట్ తాగితే ఆరోగ్యానికి హానికరం అనే హె చ్చరిక తరహాలో సమోసా, జిలేబీలు, పకోడీ, వడాపావ్, చాయ్ బిస్కెట్స్ వంటి ఆహార పదార్థాలకు కూడా ఆరోగ్య హెచ్చరికల్ని ప్రారంభించనుంది.
ఈ నేపథ్యంలో స్థూలకాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యాల యాలు, ఇతర సంస్థల్లో నూనె, చక్కెర పరిణామాన్ని ప్రదర్శించే బోర్డులను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. సమోసా, జిలేబీ లాంటి ఆహార పదార్థాల్లో అధిక స్థాయిలో ఉండే నూనె, చక్కెర, ట్రాన్స్ ఫ్యా ట్స్ వల్ల దేశంలో ఉబకాయుల సంఖ్య పెరగడంతో పాటు బీపీ, గుండె జబ్బులకు దారి తీస్తున్నది.
2050 నాటికి దేశంలో దాదాపు 45 కోట్ల మంది భారతీయులు ఉబకాయంతో బాధపడే అవకాశముందని ది లా న్సెట్ జర్నల్ కథనం ప్రచురించింది. కాగా ఈ ప్రచారాన్ని మొదటగా నాగ్‌పూర్‌ఎయిమ్స్‌లో ప్రారంభించనున్నారు. క్యాంప స్‌లోని క్యాంటీన్లు, భోజనశాలల్లో ఈ ఆ హారా లు ఉండే దగ్గర చక్కెర, నూనె, ప్యాట్స్ ఎ ంత మోతాదులో ఉన్నాయనేది బోర్డుల రూ పంలో ప్రదర్శించనున్నారు.