20-10-2025 01:27:41 AM
నిర్మల్, అక్టోబర్ 1౯ (విజయక్రాంతి): నూతన ఎక్సైజ్ పాలసీలో యువతరం దిగిం ది. ప్రభుత్వం మద్య షాపుల టెండర్లకు ఒకప్పుడు బడా వ్యాపారులు రాజకీయవేత్తలు టెండర్లు వేయగా ప్రస్తుతం ఆ రంగంలోకి ఇతర వర్గాలు కూడా దిగడంతో పోటీ పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరంగాను మద్యం పాలసీకి టెండర్ల ప్రక్రియను చేపట్టింది.
జిల్లాలో మొత్తం 47 మద్యం షాపులు ఉండగా అందులో పదిహేను శాతం గౌడులకు 10 శాతం ఎస్సీలకు ఐదు శాతం ఎస్టీలకు రిజర్వేషన్ చేయగా 37 షాపులను ఓపెన్ టెండర్ విధానంలో ప్రారంభించుకొనెందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం మద్యం షాపులను దక్కించుకునేందుకు ఈసారి రెండు లక్షల ఉన్న రుసు మును 3 లక్షలకు పెంచింది. గత సంవత్స రం 1046 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి 21 ఆదాయం సమకూర్చింది.
అయితే ఈ సంవత్సరం ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ అమలు చేసి ఫీజులు మూడు లక్షలకు పెంచడం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా గ్రూపులుగా ఏర్పడి మద్యం దరఖాస్తులు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఒకప్పుడు రాజకీయ పలుకుబడి ఉన్న నేతలు బడా వ్యాపారులు ఫైనా న్షియరులు రియల్ ఎస్టేట్ దందా చేసేవారు మద్యం దుకాణాలకు టెండర్లు వేసి దక్కించుకునేవారు.
చిన్న వ్యాపారులు మద్యం దుకాణాలకు వెళ్లేవారు కాకపోవడం తో దరఖాస్తులు తక్కువగా వచ్చి ప్రభుత్వ ఆదానికి గండిపడేది. దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువగా 40 సంవత్సరాలు పైనే ఉన్న వ్యాపారులు మద్యం వ్యాపార రంగం లో ఉండేవారు
కొత్త పాలసీలు యువ తరంగం
వ్యాపార రంగంలో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో కొందరు మద్యం దుకాణాల వైపు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో మద్యం దుకాణాలకు గిరాకీ ఉండడం ఎక్కువ మొత్తంలో టర్నోవర్ చేసుకోవడం ఎక్కువ లాభాలు ఉండడంతో ఎక్సైజ్ పాలసీ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించి ప్రయోజనాలను వివరించడంతో ఈ సంవత్సరం యువకులు పెద్ద ఎత్తునలో దరఖాస్తులు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది.
నిర్మల్ బైసా బాసర ఖానాపూర్ మామడా సారంగాపూర్ తదితర ప్రాం తాల్లో ఇదివరకు వేరే వ్యాపారం చేసుకుంటున్న వారు ఎప్పుడు తమ పిల్లలను మద్యం వ్యాపారంలోకి దించుతున్నారు. గత వారం రోజులుగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో మద్యం దుకాణాలకు టెండర్లను వేసేందుకు పెద్ద ఎత్తున లో యువకులే రావడం అధికారుల సైతం ఇస్మాయానికి గురిచేసింది.
ప్రస్తుతం ఇతర వ్యాపారాలు కోడిగా సాగుతున్న తరుణం లో దానికి జోడిగా మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు వ్యాపారులు తమ పిల్లలను మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు చేయించినట్లు ప్రచారం జరుగుతుంది. జిల్లాలో 47 షాపులకు మొత్తం 931 పైగా దరఖాస్తులు రాగా ఇందులో 600 పైగా దరఖాస్తులు 35 సంవత్సరంలో యువకులవే ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.
మద్యం దుకాణానికి టెండర్ రుసుమును మూడు లక్షలకు పెంచడం వల్ల కొందరు యువకులు గ్రూపుగా ఏర్పడి చర్లక్ష పెట్టుబడిపెట్టి 10 నుంచి 15 మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. మూడు లక్షల పెట్టి ఒక్క షాపుకు దరఖాస్తు చేసుకుంటే అది లక్కీలో రాకుంటే పెట్టుబడి నష్టపోతామని భావిస్తున్న యువకులు వివిధ గ్రూపుల్లో చేరి షేర్ వాటా కింద లక్ష నుంచి మూడు లక్షల వరకు పెట్టుబడి పెట్టి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
లక్కీలో షాపు వరిస్తే..
కనీసం 10 షాపులకు దరఖాస్తు చేసుకుం టే అందులో నుంచి రెండు లక్కీలో లభించిన కోటి రూపాయల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేసుకుంటున్నారు. లక్కీలో షాపు వరిస్తే ఇతర వ్యాపారులు దాన్ని ప్రాంతాన్ని బట్టి అక్కడ జనాభాను బట్టి 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు గుడి విలుగా చెల్లించి షాపును బడా వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో యువకులైన పిల్లలు ఈ వ్యాపారం వైపు ముగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
స్థిరాస్తి ఇతర వ్యాపారంగంలో నల్లధనాన్ని బయటకు తీసుకునేందుకు మద్యం టెండర్లు కొందరు పాల్గొంటున్నారు. మద్యంతో ఏమాత్రం సంబంధంలేని కొందరు ఈ వ్యాపారం పై మక్కువ చూపి దరఖాస్తు చేసుకుంటున్నారని ఈ పరిస్థితి ఏ మేరకు వెళ్లిం దో అర్థం చేసుకోవచ్చు. . ఇందులో యువ డాక్టర్లు ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారులు బినామీ పేర్లపై వారి కుటుంబ సభ్యుల పేర్లపై మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు టెండర్ల ప్రక్రియలో పాల్గొంటున్నారు
గడువు పెంచిన ప్రభుత్వం
నూతన ఎక్సైజ్ పాలసీల బాగా రాష్ట్ర ప్రభుత్వం మద్యం టెండర్ల దాఖలకు గడువులు ఈనెల 23 వరకు పొడిగించింది. ఈ నెల 18 వరకు మద్యం పాలసీక టెండర్లను దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించగా చివరి రోజు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి అయితే ఈసారి దరఖాస్తుదారు ల సంఖ్య పెరుగుతుందని ఎక్సైజ్ శాఖ అం చనా వేసినప్పటికీ ఇప్పటికీ 930 దరఖాస్తు లు రాగా గత సీజన్‌తో పోలిస్తే 100 దరఖాస్తులు తక్కువ రావడం జరిగింది.
శనివారం చివరి రోజు కావడంతో బీసీల బంధు నిర్వహించడం కొన్ని షాపులకు తక్కువగా దరఖా స్తులు రావడం దీపావళి సెలవులు తదితర కారణాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ గడువును 23 వరకు పొడిగించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో చివరి నిమిషం వరకు కొన్ని కారణాలవల్ల దరఖాస్తు చేసుకోలేని వారు దీపావళి తర్వాత దరఖాస్తు చేసుకునే వెలుసులుబాటు కలిగింది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ మేరకు ప్రయోజనాలు చేకూస్తుందో ఈనెల 23 లోపు తేలని ఉంది. ఈనెల 27 కలెక్టర్ కార్యాలయంలో వచ్చిన దరఖాస్తులను లక్కీ డ్రా రూపంలో తీయని ఉండడంతో అదృష్టం ఎవరిని వరిస్తుందో అందులో యువతరంగం ఎన్ని షాపులు దక్కుతుందో వేచి చూడవలసింది