04-05-2024 12:23:43 AM
రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ చురకలు
అమేథీ సీటు మార్పుపై ప్రధాని చెణుకులు
వయనాడ్‌లో రాహుల్‌కు ఓటమి భయం పట్టుకుంది
సోనియా పారిపోయి రాజ్యసభకు వెళ్లారు
న్యూఢిల్లీ, మే 3: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమేథీ నుంచి కాకుండా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తుండటంపై ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో చెణుకులు విసిరారు. ఓటమి భయంతో రాహుల్ గాంధీ అమేథీ నుంచి పారిపోయారంటూ చురకలు అంటించారు. పశ్చిమ బెం గాల్‌లోని బర్ధమాన్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడు తూ.. ‘ఇవాళ నేను మనస్ఫూర్తిగా ఆయనకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. భయపడకు.. పారిపోకు..’ అంటూ తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. సోనియా గాంధీపై కూడా ఆయన విమర్శలు కురిపించారు. ‘నేనెప్పు డో చెప్పాను. ఆ పార్టీ పెద్ద నేతకు కూడా పో టీ చేసే ధైర్యం లేదు.
అందుకే ఓటమి భయంతో ఆమె పారిపోయారు. రాజస్థాన్‌కు పారిపోయి అక్కడి నుంచి రాజ్యసభకు వచ్చారు’ అంటూ సోనియాపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. అలాగే కాంగ్రెస్ రాకు మారుడికి కూడా వయనాడ్‌లో ఓటమి భయం పట్టుకుందని, పోలింగ్ ముగియగానే మూడో సీటు కోసం దిక్కులు చూశా రని దుయ్యబట్టారు. అమేథీలో పోటీ చేయడానికి కూడా రాహుల్ చాలా భయపడ్డారని ఆయన అనుచరులే చెప్పారని మోదీ పేర్కొన్నారు. అందుకే అక్కడి నుంచి పారిపోయి రాయ్‌బేలీవైపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘వాళ్లు భయపడొద్దని ప్రజలకు చెబుతున్నారు. కానీ ఇవాళ వాళ్లకు ఒక విషయాన్ని మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నా.. మీరు భయప డకండి.. పారిపోకండి’ అని ప్రధాని హితవు పలికారు.
టీఎంసీపై విమర్శల పర్వం
పశ్చిమ బెంగాల్ అధికార టీఎంసీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శల పర్వం కొనసాగించారు. అవినీతి, బుజ్జగింపు రాజకీయాల్లో తలమునకలై ఉందని విమర్శించారు. హిందువులను తృణమూ ల్ కాంగ్రెస్ సెకండ్ క్లాస్ పౌరులుగా మార్చిందంటూ దుయ్యబట్టారు. సందేశ్‌ఖాలీలో హిందూ బాధితుల పట్ల టీఎంసీ ప్రభుత్వం కాస్త జాలి కూడా చూపించలేదని మండిపడ్డారు. ‘బుజ్జగింపు రాజకీ యాల్లో బిజీగా ఉన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సందేశ్‌ఖాలీ నిందితుడైన షాజహాన్ షేక్‌ను కనీసం ముట్టుకో లేదు. అక్కడ ఎంతోమంది మహిళలపై దౌర్జన్యాలు జరిగాయి. నేరస్తులకు శిక్ష పడా లని దేశం మొత్తం కోరుకుంటోంది. కానీ అసలైన నిందితుడిని టీఎంసీ కాపాడుకుంటూ వస్తోంది’ అని పేర్కొన్నారు. హిందువులను భాగీరథి నదిలో తోసేయాలంటూ టీఎంసీ ఎమ్మెల్యే హుమా యున్ కబీర్ చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందిస్తూ.. పశ్చిమ బెంగాల్‌లో హిందువులను ఎందుకు సెకండ్ క్లాస్ పౌరు లుగా పరిగణిస్తున్నారంటూ ప్రశ్నలు సంధిం చారు.