calender_icon.png 10 September, 2025 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గరుడ వాహనంపై వేంకటేశ్వరుడి దర్శనం

27-08-2024 01:05:32 AM

 చేవెళ్ల, ఆగస్టు 26 : శ్రావణమాసం పురస్కరించుకొని చేవెళ్ల మండల కేంద్రంలోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం గంప జాతరను ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారులు, ధర్మకర్త దేవుని వామనాచారి, కార్యనిర్వహణ అధికారి నరేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేంకటేశ్వరుడి విగ్రహాన్ని గరుడ వాహనంపై ఊరేగించారు. కార్యక్రమంలో రమాకాంత్, నరసింహ, స్వామివారి సేవా బృందం, భక్తులు పాల్గొన్నారు.