09-08-2025 01:18:26 AM
దండేపల్లి, ఆగస్టు 8 (విజయక్రాంతి) : దండేపల్లి పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాశ్‌తో కలిసి ఆకస్మి కంగా తనిఖీ చేశారు. పిటిషన్‌లను, రికార్డ్ లను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, నమోదు చేయబడిన కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ప్రజలతో, ఫిర్యాదుదారులతో ఎలా ప్రవర్తిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడు తూ పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచా రణ చేపట్టి న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహిం చి ప్రజల సమస్యలు, పిర్యాదులు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని, గంజాయి,మత్తు పదార్థా ల, పీడీయస్ రైస్, గుడుంబా సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. డీసీపీ వెంట దండేపల్లి ఎస్ ఐ తైసినోద్దీన్, పోలీసు లు, సిబ్బంది ఉన్నారు.