calender_icon.png 9 August, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతి పురాతనమైనది సనాతన హిందూ ధర్మం

09-08-2025 01:20:02 AM

సామూహిక వరలక్ష్మీ వ్రతం కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ 

ఆదిలాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి):  అతి పురాతనమైనది హిందూ ధర్మం అని, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునే బాధ్యత మన అందరిపైనా ఉందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మన ధర్మాన్ని కాపాడడంతో పాటు మన రాబోయే తరాలకు ముఖ్య ముగా యువతకు మన హిందూ ధర్మం సం ప్రదాయాలను అందించాలని ఇటువంటి అనే క కార్యక్రమాలను చేయడంలో సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యలు ఎప్పుడు ముందుంటారని అన్నారు.

శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలో భాగంగా ఆదిలాబాద్ లోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, అమ్మవారికి కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. సామూహిక వరలక్ష్మీ వ్రతం పూజలో పెద్ద ఎత్తున మహిళ లు పాల్గొని వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీఓ స్రవంతి, జిల్లా గిరిజన క్రీడల అధికారి కొరెడ్డి పార్థ సారథి, ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖ త్రి, గౌరవ అధ్యక్షుడు బండారి వామన్, ఉపాధ్యక్షులు రవీందర్ పాల్గొన్నారు

భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు

కుమ్రం భీం ఆసిఫాబాద్ , ఆగస్టు 8 (విజయక్రాంతి): శ్రావణ మాసం పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మహిళలు వైభవంగా వరలక్ష్మీ వ్రతాలు చేసుకున్నారు. దీంతో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పలు ఆలయాల్లో అమ్మవార్లను పూల తో విశేషంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో సామూహిక వ్రతాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. మహిళా భక్తులు ఒకరికొకరు వాయినాలు అందజేసుకున్నారు. ఆసిఫాబాద్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి మాతకు శుక్రవారం చీర సారె కార్యక్రమాన్ని నిర్వహించారు.