calender_icon.png 22 May, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శ్రీపాదరావు వర్ధంతి వేడుకలు

13-04-2025 08:55:00 PM

మహదేవపూర్,(విజయక్రాంతి): అజాత శత్రువు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గల శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. అనంతరం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహదేపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్బర్ ఖాన్, మాజీ ఎంపీపీ రాణి బాయి, మాజీ జెడ్పిటిసి అరుణ, మాజీ కాలేశ్వరం దేవస్థానం చైర్మన్ వామన్ రావు, మంతిని డివిజన్ యూత్ అధ్యక్షులు విలాస్ రావు, మండల యూత్ అధ్యక్షులు కటకం అశోక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.