calender_icon.png 16 August, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా స్వర్గీయ మాజీ ప్రధాని వాజ్ పేయి వర్థంతి వేడుకలు

16-08-2025 07:15:19 PM

ఘట్కేసర్: భారతరత్న దేశ మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారి వాజ్ పేయి వర్థంతి వేడుకలను శనివారం భారతీయ జనతా పార్టీ ఘట్కేసర్ మున్సిపల్(Ghatkesar Municipality) కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆపార్టీ నాయకులు వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ మున్సిపల్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, దేశ ప్రధానిగా వాజ్ పేయి ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు బిజెపి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ ఉపాధ్యక్షులు పడిగం వీరేశం, సీనియర్ నాయకులు పల్లె మధుసూదన్ గౌడ్, సగ్గు మోహన్ రావు, దేశం అభిమన్యు, పల్లె ఆంజనేయులు గౌడ్, కట్ట మధుసూదన్ రెడ్డి, భాను ప్రకాష్, పవన్ సింగ్, ప్రవీణ్, హర్ష తదితరులు పాల్గొన్నారు.