calender_icon.png 16 August, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి డైరెక్టర్ ను కలిసిన ఇల్లందు ఎమ్మెల్యే

16-08-2025 07:12:29 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): సింగరేణి డైరెక్టర్ గౌతమ్ పోట్రుని శనివారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో  మర్యాద పూర్వకంగా కలిశారు. టేకులపల్లి మండలంలోని  కోయగూడెం, ఇల్లందు ఉపరితల గనుల పరిసర ప్రాంతాలలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్ళకు సింగరేణి మట్టి వాడుకునేందుకు వెసులుబాటు కల్పించాలని, పూసపల్లి, జెకే నూతన ఓసి పనులు త్వరితగతి మొదలు పెట్టెందుకు చర్యలు తీసుకొవాలని కోరారు. సింగరేణి భూములలో నివాసం ఉంటున్న పేదలకు వారు ఉంటున్న స్ధలంలో ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు.