16-08-2025 07:17:34 PM
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కేంద్రంలోని రామాలయంలో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు రామాలయం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో మెరిసిపోతూ అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.